కోల్‌కతా: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 39వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నది. గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు, రెడు ఓటములతో మూడో స్థానంలో ఉన్నది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. లక్ష్య ఛేదనలో తమ జట్టు ఎంతలా చెలరేగుతుందో నిరూపిస్తూ మరో విజయం సాధించింది. విజయ్ శంకర్(51 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(49), డేవిడ్ మిల్లర్(32 నాటౌట్) రాణించారు.
A 🔝 of the Table victory in Kolkata for the @gujarat_titans 🙌🏻
They ace the chase yet again to register their fourth away win in a row 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/sR5TSGeJ94
— IndianPremierLeague (@IPL) April 29, 2023
హైదరబాద్‌కు షాక్.. ఇషాంత్ శర్మ ఓవర్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5) ఔటయ్యాడు. కీపర్ ఫిలిఫ్ సాల్ట్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
డేవిడ్ మిల్లర్(26) దూకుడు పెంచాడు. సుయాశ్ శర్మ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. విజయ్ శంకర్(12) ఫోర్ బాదాడు. ఆడుతున్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 129 /3. గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు కావాలి.
గుజరాత్ రెండో వికెట్ పడింది. హర్షిత్ రానా ఓవర్లో హార్దిక్ పాండ్యా(26) ఎల్బీగా ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
స్పిన్నర్ల రాకతో గుజరాత్ స్కోర్ వేగం తగ్గింది. సునీల్ నరైన్ ఓవర్లో 7 పరుగులు వచ్చాయంతే. శుభ్‌మన్ గిల్(44), హార్దిక్ పాండ్యా(10) ఆడుతున్నారు. 8 ఓవర్లకు స్కోర్.. 70 /1
శుభ్‌మన్ గిల్(35) వేగం పెంచాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో బౌండరీ కొట్టాడు. దాంతో, గుజరాత్ స్కోర్ 50 దాటింది. హార్దిక్ పాండ్యా(5) ఆడుతున్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 52 /1
గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. రస్సెల్ ఓవర్లలో వృద్ధిమాన్ సాహా(10) ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్(29) ఉన్నాడు.
హర్షిత్ రానా ఓవర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(27) రెచ్చిపోయాడు. హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఆఖరి బంతిని కూడా బౌండరీకి తరలించాడు. దాంతో, 19రన్స్ వచ్చాయి. వృద్ధిమాన్ సాహా(4) మూడు ఓవర్లకు స్కోర్.. 32/0
షమీ వేసిన 20వ ఓవర్లో ఆండ్రూ రస్సెల్(34) వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. దాంతో, కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
సొంత మైదానంలో కోల్‌కతా ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (81) విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(34) చెలరేగడంతో కోల్‌కతా 7వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మంచి ఆరంభం లభించినా నితీశ్ రానా సేన రెండొందలు కొట్టలేకపోయింది. గుజరాత్ బౌలర్లు పుంజుకొని కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారీ స్కోర్ సాధ్యం కాలేదు.
Innings break!
A solid batting performance from @KKRiders as they post 179/7 in the first innings 👌🏻👌🏻
Will @gujarat_titans chase this down? We will find out soon!
Scorecard ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT pic.twitter.com/lKOleZAfaD
— IndianPremierLeague (@IPL) April 29, 2023
టాస్ ఓడిన కోల్‌కతాను షమీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జగదీశన్(19)ను శార్థూల్ ఠాకూర్(0)ను డకౌట్ చేశాడు. జోష్ లిటిల్ ఒకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్(11), కెప్టెన్ నితీశ్ రానా(4)నె పెవిలియన్ పంపి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (81) విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. రింకూ సింగ్(19), ఆండ్రూ రస్సెల్(34) దంచారు. గుజరాత్ బౌలర్లలో వికెట్లు తీశారు.
సిక్సర్ల పిడుగు రింకూ సింగ్(19) ఔటయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్లలో భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద జోష్ లిటిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో రింకూ ఇన్నింగ్స్ ముగిసింది. ఆండ్రూ రస్సెల్(19) ఆడుతున్నాడు.
ఆండ్రూ రస్సెల్(14) రెచ్చిపోయాడు. రషీద్ ఖాన్ ఓవర్లో రెండు సిక్స్‌లో కొట్టాడు. దాంతో, కోల్‌కతా స్కోర్ 150 చేరింది. రింకూ సింగ్(19) ఆడుతున్నాడు. 17 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 151/5
నూర్ అహ్మద్ బిగ్ వికెట్ తీశాడు. దంచికొడుతున్న ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (81)ను ఔట్ చేశాడు. గుర్బాజ్ కొట్టిన బంతిని రషీద్ ఖాన్ అందుకున్నాడు. దాంతో, కోల్‌కతా 135 పరుగులకు సగం వికెట్లు పడ్డాయి. ఆండ్రూ రస్సెల్ వచ్చాడు. రింకూ సింగ్(17) ఆడుతున్నాడు.
హార్దిక్ పాండ్యా ఓవర్లో రహమనుల్లా గుర్బాజ్ (67) సిక్స్ కొట్టాడు. దాంతో, కోల్‌కతా స్కోర్ వంద దాటింది. రింకూ సింగ్(2) ఆడుతున్నాడు. 13 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 105/4.
జోష్ లిటిల్ ఓవర్లో కోల్‌కతా నాలుగో వికెట్ పడింది. కెప్టెన్ నితీశ్ రానా(4) ఔటయ్యాడు. నాలుగో బంతికి రాహుల్ తెవాటియాకు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు మొదటి బంతికి ఫామ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్(11) ఔటయ్యాడు.
కోల్‌కతా మూడో వికెట్ పడింది. ఫామ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్(11) ఔటయ్యాడు. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (52) ఆడుతున్నాడు. 10 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 84/3.
PLUMB!
Joshua Little breaks the partnership for @gujarat_titans 🙌🏻
Venkatesh Iyer walks back for 11.
Follow the match ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT pic.twitter.com/HXaftnq3BA
— IndianPremierLeague (@IPL) April 29, 2023
ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (51) హాఫ్ సెంచరీ కొట్టాడు. జోష్ లిటిల్ ఓవర్లో రెండు పరుగులు తీసి యాభై పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో అతను ఫిఫ్టీ కొట్టాడు. వెంకటేశ్ అయ్యర్(9) ఆడుతున్నాడు. 9 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 80/2.
Half-century for @RGurbaz_21 💪🏻
What an entertaining knock this has been so far from the @KKRiders opener 👌🏻👌🏻#KKR move to 80/2 after 9 overs.
Follow the match ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT pic.twitter.com/tIShBvzQDG
— IndianPremierLeague (@IPL) April 29, 2023
షమీ రెండో వికెట్ తీశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన శార్థూల్ ఠాకూర్(0)ను డకౌట్ చేశాడు. దాంతో కోల్‌కతా 47 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు. కు ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (27) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 47/2.
కోల్‌కతాకు ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (16) దంచుతున్నాడు. హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసిన అతను రెండు సిక్స్‌లు బాదాడు. షాకిచ్చాడు. శార్థూల్ ఠాకూర్(0) ఆడుతున్నాడు. 4 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 36/1
కోల్‌కతాకు షమీ షాకిచ్చాడు. ఓపెనర్ జగదీశన్(19)ను ఎల్బీగా ఔట్ చేశాడు. కోల్‌కతా రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శార్థూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. రహమనుల్లా గుర్బాజ్ (3) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 23/1
LBW!@MdShami11 gets the opening breakthrough for @gujarat_titans 🙌🏻
N Jagadeesan departs for 19.
Follow the match ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT pic.twitter.com/xa4cwPHgcw
— IndianPremierLeague (@IPL) April 29, 2023
మొదటి ఓవర్లో కోల్‌కతా టీమ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ సమీ బౌలింగ్‌లో ఎన్ జగదీశ్న ఐదు బంతులు ఎదుర్కొని ఒక సింగిల్ తీయగా ఆరో బంతికి రహమానుల్లా గుర్బాజ్ రెండు పరుగులు రాబట్టాడు.
వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయిన మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం తగ్గిపోవడంతో గ్రౌండ్ సిబ్బంది కవర్స్‌ను తొలగించారు. సాయంత్రం 4.15 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అదేవిధంగా ఆట 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నా ఓవర్లలో ఎలాంటి కోత పెట్టడం లేదని తెలిపారు.
గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ అనంతరం సన్నగా చినుకులు మొదలు కావడంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. వాతావరణం అనుకూలించగానే మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నది.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్, శ్రీకర్ భరత్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, శివమ్ మావి, జయంత్ యాదవ్.
కోల్‌కతా నైట్ రైడర్స్: సుయాశ్ శర్మ, మన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, కుల్వంత్ ఖెజ్రోలియా
గుజరాత్ టీమ్: వృద్ధిమాన్ సాహ (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ మహమ్మద్ సమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.
కోల్‌కతా టీమ్: ఎన్ జగదీశన్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, శార్ధూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.