కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టును వెటరన్ పేసర్ టిమ్ సౌథీ దెబ్బకొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు తొలి షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7)ను రెండో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. దీంతో ఎనిమిది పరుగులకే ఒక వికెట్ కోల్పోయిన గుజరాత్ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టును ఆదుకున్నాడు.
వెటరన్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా (16 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హార్దిక్ ధాటిగా ఆడుతుండటంతో.. గుజరాత్ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.