ఆరంభంలోనే ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (18), అజింక్య రహానే (8) వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నాడు. నితీష్ రాణా (22 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన శ్రేయాస్ (39 నాటౌట్).. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు.
లక్ష్యం భారీగా ఉండటంతో వికెట్లు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని శ్రేయాస్ గుర్తించాడు. అందుకే రిస్కీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతా జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.