కోల్కతా బౌలర్లను ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు. మధ్యలో కాసేపు కేకేఆర్ బౌలర్లు పుంజుకున్నా.. చివర్లో శార్దూల్ ఠాకూర్ (29 నాటౌట్), అక్షర్ పటేల్ (22 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీకి భారీ స్కోరు అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (61) అదిరిపోయే ఆరంభం అందించారు.
ఆ తర్వాత పంత్ (27) కూడా చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. అయితే లలిత్ యాదవ్ (1), రావ్మెన్ పావెల్ (8) నిరాశపరచడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయడం కష్టంగా కనిపించింది. కానీ చివర్లో శార్దూల్, అక్షర్ చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం నిలిపింది. మరి కోల్కతా బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!@davidwarner31 & @PrithviShaw's half-centuries & cameos from @imShard, @RishabhPant17 & @akshar2026 power @DelhiCapitals to 215/5. 👏 👏
The @KKRiders chase to begin shortly. 👍 👍
Scorecard ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/7pfcDeEhSC
— IndianPremierLeague (@IPL) April 10, 2022