గువాహటి: భారత్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్‌కు తాకాయి. మైనార్టీ హిందువులపై దాడులు చేస్తున్న బంగ్లాదేశీయులను ఐపీఎల్లో ఆడించడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న వేళ బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇటీవల జరిగిన వేలంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.20 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్..బీసీసీఐ తాజా ఆదేశాల మేరకు అతన్ని వదులుకుంది.
ఓవైపు హిందువులపై దాడులు జరుగుతున్నా..బంగ్లా క్రికెటర్లను ఆడించడంపై పలు హిందూ సంఘాలు నిరసనకు దిగడంతో బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జరుగుతున్న పరిణామాలను అంచనా వేసిన బోర్డు..శనివారం కేకేఆర్ మేనేజ్మెంట్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో రానున్న సీజన్‌కు జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను తీసివేస్తూ కేకేఆర్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే అతనిస్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం..కేకేఆర్‌కు బీసీసీఐ కల్పించింది.