కోల్‌కతా : పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు 2024 సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్‌కు ఆ జట్టు గుడ్‌బై చెప్పింది. 2022లో బ్రెండన్ మెక్కల్లమ్ స్థానంలో నియమితుడైన పండిట్.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కేకేఆర్ టైటిల్ కరువును తీర్చాడు. కానీ తాజాగా అతడు.. కేకేఆర్‌ను వీడాడు.
ఈ మేరకు కేకేఆర్ ఓ ప్రకటనలో.. ‘వచ్చే ఏడాది నుంచి కేకేఆర్‌కు చంద్రకాంత్ హెడ్‌కోచ్‌గా కొనసాగడం లేదు. మమ్మల్ని చాంపియన్‌గా నిలపడమే గాక పటిష్టమైన జట్టును తయారుచేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టుకు ఆయన చేసిన సేవలకు గాను మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని తెలిపింది. పండిట్ హయాంలో కేకేఆర్.. మూడు సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడి 22 గెలిచి 18 మ్యాచ్‌లలో ఓడింది. రెండింట్లో ఫలితం తేలలేదు.