ముంబై: శ్రీలంకతో ఇవాళ టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ముంబైలో జరగనున్న ఆ మ్యాచ్ కన్నా ముందే.. టీమిండియా ప్లేయర్లు కొత్త ఫోటోలను రిలీజ్ చేశారు. ప్లేయర్లు ధరించిన బ్లూ జెర్సీలపై కొత్త లోగో ఉంది. చాహల్ తన ఇన్స్టాలో పోస్టు చేసిన ఫోటోలో ఆ కొత్త లోగోను గుర్తుపట్టవచ్చు. అయితే కిట్ స్పాన్సర్షిప్ మారిన విషయంపై మాత్రం ఇప్పటి వరకు బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీసీసీఐ కూడా తన ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో కిల్లర్ లోగో ఉన్న జెర్సీలను టీమిండియా ప్లేయర్లు ధరించారు. కానీ బీసీసీఐ మాత్రం దానిపై వివరణ ఇవ్వలేదు.
Lights 💡
Camera 📸
Action ⏳Scenes from #TeamIndia's headshots session ahead of the T20I series 👌 👌#INDvSL | @mastercardindia pic.twitter.com/awWGh4eVZh
— BCCI (@BCCI) January 3, 2023