న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 13-9 తేడాతో ముంబై మజిల్పై అద్భుత విజయం సాధించింది. దీంతో మొత్తం 137 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది.
శనివారం జరిగే సెమీస్లో రోహ్తక్ రౌడీస్తో హైదరాబాద్ తలపడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. అండర్కార్డ్లో హైదరాబాద్ రెజ్లర్లు అలీ, అక్తర్, మధుర విజయాలు సాధించారు. కీలకమైన మెయిన్ కార్డ్లో స్టీవ్ థామస్, జగదీశ్ ప్రత్యర్థులపై విజయాలు సాధించగా, సిద్ధార్థ్ మలాకర్ ఓటమిపాలయ్యాడు.