న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం కడదాకా నువ్వానేనా అన్నట్లు సాగిన సెమీస్ పోరులో హైదరాబాద్ 20-18తో రోహ్తక్ రౌడీస్పై అద్భుత విజయం సాధించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో కొచ్చి కేడీస్తో హైదరాబాద్ తలపడుతుంది.