న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్లో కిరాక్ హైదరాబాద్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ 12-11తో కొచ్చి కేడీస్పై అద్భుత విజయం సాధించింది. దీంతో వరుసగా ఆరో గెలుపును ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ 124 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నది.
అండర్కార్డ్ పోరులో హైదరాబాద్ తరఫున స్టీవ్ థామస్, సవితా కుమారి గెలిచారు. మెయిన్ కార్డ్లో జగదీశ్, అస్కర్ అలీ విజయాలు సాధించగా, జిన్సీ జోస్ ఓటమిపాలైంది. శుక్రవారం తమ చివరి మ్యాచ్లో ముంబైతో హైదరాబాద్ తలపడుతుంది.