దుబాయ్ : కింగ్ కోహ్లీ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఆసియాకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని పాకిస్తాన్ పేసర్ హరీస్ రవూఫ్‌కి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. మ్యాచ్‌కు ముందుకూడా ఇరుజట్ల ఆటగాళ్లు పలువురు జ్ఞాపికలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.