Kieron Pollard : టీ20ల్లో రికార్డుల వీరుడిగా పేరొందిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) మళ్లీ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో ఈ విధ్వంసక ఆటగాడు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. సదర్న్ బ్రేవ్ (Southern Braves) జట్టుకు ఆడుతున్న పొలార్డ్ ట్రెంట్ రాకెట్స్ (Trent Rockets) బౌలర్లను ఉతికేశాడు. అతడి ధాటికి ఫేమస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) బలయ్యాడు.
రషీద్ ఓవర్లో మరింత చెలరేగిన కరీబియన్ హిట్టర్ ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 రన్స్ కొట్టాడు. దాంతో, సదర్న్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పొలార్డ్ విధ్వంసంతో సదర్న్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
6⃣6⃣6⃣6⃣6⃣
(via @thehundred) #TheHundred pic.twitter.com/wAsObe6VZi
— ESPNcricinfo (@ESPNcricinfo) August 10, 2024
సదర్న్ జట్టుకు కీలకమైన ఆ మ్యాచ్‌లో పొలార్డ్ వీరవిహారం చేశాడు. 127 పరుగుల ఛేదనలో 78కే 6 వికెట్లు పడిన దశలో పొలార్డ్ ఉగ్రరూపం దాల్చాడు. రషీద్‌ను టార్గెట్ చేసిన అతడు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లతో , 30 పరుగులు పిండుకున్నాడు. పొలార్డ్‌ను ఎలా నిలువరించాలో తెలియక రషీద్ తెల్లముఖం వేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు 2023లో వీడ్కోలు పలికిన పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.