శనివారం 29 ఫిబ్రవరి 2020
భారత్‌ Xథాయ్‌లాండ్‌

భారత్‌ Xథాయ్‌లాండ్‌

Feb 13, 2020 , 23:48:25
PRINT
 భారత్‌ Xథాయ్‌లాండ్‌
  • ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి ఘనంగా బోణీ కొట్టిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4తో మలేషియా చేతిలో ఓడింది. సింగిల్స్‌లో శ్రీకాంత్‌ మినహా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు పరాజయం పాలయ్యారు. అయితే ‘కరోనా వైరస్‌'భయంతో చైనా వంటి దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాయి. మొదటి టైలో కజకిస్థాన్‌పై నెగ్గి గ్రూప్‌-బిలో రెండో స్థానం దక్కించుకున్న భారత్‌.. శుక్రవారం క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనుంది.


logo