Kidambi Srikanth | బాసెల్ : స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జిలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్.. 21-16, 21-15 తేడాతో టాప్ సీడ్ లి జి జియా (మలేషియా)ను ఓడించాడు.
గత కొంతకాలంగా తొలి రౌండ్లకే పరిమితమవుతున్న శ్రీకాంత్‌కు 16 మ్యాచ్‌ల తర్వాత ఇదే తొలి క్వార్టర్స్ కావడం గమనార్హం. మరోవైపు రజావత్ 21-14, 21-13 తేడాతో చైనాకు చెందిన లి లా జి ని ఓడించాడు. లక్ష్యసేన్‌తో పాటు పీవీ సింధు పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే
ముగిసింది.