హైదరాబాద్, ఆట ప్రతినిధి : మంచిర్యాల కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర స్థాయి టోర్నీ జరుగనుంది. జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికలో భాగంగా జరుగుతున్న ఈ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సంబంధించి పోస్టర్‌ను సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, సంయుక్త కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.