ఢిల్లీ: ఢిల్లీ వేదికగా ఈనెల 13 నుంచి మొదలుకాబోయే ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ సారథులను ప్రకటించింది. పురుషుల జట్టుకు ప్రతీక్ వాయికర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లె కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు నేపాల్‌తో, మహిళల జట్టు దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లతో టైటిల్ వేటను ఆరంభించనున్నాయి.