హైదరాబాద్, ఆట ప్రతినిధి: లఢాక్ (జమ్ము కశ్మీర్) వేదికగా జరుగుతున్న 4వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల అండర్-17 ఐస్ స్కేటింగ్ 300మీ, 500మీటర్ల విభాగాల్లో నయన శ్రీ తాల్లురి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది.
మరోవైపు బాలుర 500మీటర్ల ఐస్ స్కేటింగ్ కేటగిరీలో ప్రణవ్ మాధవ్ స్వర్ణంతో పాటు రజతం సొంతం చేసుకున్నాడు. జాతీయ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అమితాబ్ శర్మ..తెలంగాణ స్కేటర్లను ప్రత్యేకంగా అభినందించారు.