ఖేలో ఇండియా యూత్ గేమ్స్
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక హవా కొనసాగుతున్నది. బాలికల అండర్-18 బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి కాంస్య పతకంతో మెరిసింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన నిత్య 2:28:30 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. రిధిమ (కర్ణాటక), పాలక్ (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకం గెలిచిన పిన్న వయసు (13 ఏండ్ల) ప్లేయర్‌గా నిత్య కొత్త రికార్డు నెలకొల్పింది. యువ స్విమ్మర్ కాంస్య ప్రదర్శనతో తెలంగాణ పతకాల సంఖ్య పదకొండుకు చేరుకుంది.