రావల్పిండి: పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత సంతతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (7/102) ఏడు వికెట్లతో సత్తాచాటాడు. సోమవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ఓవర్ నైట్ స్కోరు 259/5తో రెండో రోజు ఆరంభించిన పాక్.. మహారాజ్ స్పిన్ మాయకు 333 పరుగులకు ఆలౌట్ అయింది.
కెప్టెన్ మసూద్ (87), షకీల్ (66) పాక్‌ను ఆదుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 185/4తో నిలిచింది. ట్రిస్టన్ స్టబ్స్ (68*), టోని డి జోర్జి (55) అర్ధ శతకాలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు ఇంకా 148 రన్స్ వెనుకబడి ఉన్నారు.