కోజికోడ్: ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కేరళకు చెందిన మిని రాజు అనే మహిళా ఏఎస్ఐ పసిడి వెలుగులు విరజిమ్మింది. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలలో భారత జట్టు మూడు స్వర్ణాలు, అయిదు రజతాలు, అయిదు కాంస్య పతకాలు నెగ్గింది. 43మంది సభ్యుల భారత బృందానికి మిని రాజు సారధ్యం వహించడం విశేషం. ఈ పోటీలలో రెండు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా మిని రాజు నిలిచింది. 2018లో ఆర్మ్ రెజ్లింగ్ సాధన ఆరంభించిన ఈ పోలీస్ అధికారిణి నాలుగేండ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగింది.