జకర్తా: ఇండోనేషియా ఓపెన్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సతీశ్ కుమార్ కరుణాకరన్-ఆద్య వరియత్ సంచలనం సృష్టించారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో భారత ద్వయం.. 15-21, 21-16, 21-17తో ప్రపంచ ఆరో సీడ్ చైనీస్ తైపీ జోడీ యీ హాంగ్ వీ-నికోల్ గొంజాలెస్కు షాకిచ్చారు. కానీ ఇదే విభాగంలో తలపడ్డ తనీషా క్రాస్టో-ధృవ్ కపిల, రోహన్-రుత్విక, అషిత్-అమృత జోడీలు నిరాశపరిచాయి. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ ద్వయం.. 21-14, 22-20తో పొలిన బుహ్రోవ-కంటెమిర్ (ఉక్రెయిన్)ను ఓడించారు.