Karun Nair : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనతో భారత జట్టు సిరీస్ సమం చేసింది. టాపార్డర్, మిడిలార్డర్, బౌలింగ్ యూనిట్.. ఒక్కో మ్యాచ్‌లో ఇరగదీయడంతో టీమిండియా చరిత్ర లిఖించింది. జట్టులోని అందరి ఆట సంతృప్తికరంగానే ఉన్నా కరుణ్ నాయర్ (Karun Nair) మాత్రం దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి. నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక అర్ధ శతకం బాదిన అతడు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని కరుణ్ సైతం అంగీకరించాడు.
‘అవును.. నేను ఇంగ్లండ్ పర్యటనలో విఫలమయ్యాను. ఓవల్ టెస్టు (Oval Test)లో అర్ధ శతకం బాదాను. కానీ, దాన్ని సెంచరీగా మలచలేకపోయినందుకు చాలా నిరాశ చెందాను. అయితే.. ఆదిలోనే రెండు వికెట్లతో కష్టాల్లో పడిన జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు నా ఇన్నింగ్స్ ఎంతో ఉపయోగపడింది. గతంలో నేను ఇక్కడ గొప్పగా ఆడాను. కౌంటీల్లో సర్రే జట్టుపై 150 రన్స్ బాదాను. అందుకు నేను భారీ స్కోర్ చేస్తానని నమ్మాను. కానీ.. శతకం కొట్టలేకపోయాను. ఇకపై అవకాశం రావాలేగానీ భారీ స్కోర్లుగా మలుస్తానని నమ్మకంతో ఉన్నాను’ అని కరుణ్ వెల్లడించాడు.
Karun Nair is now looking ahead after an ‘up-and-down’ comeback series in England.#ENGvIND #KarunNair #TeamIndia pic.twitter.com/tgcjiZoepl
— Circle of Cricket (@circleofcricket) August 10, 2025
అంతేకాదు తాను ఇంగ్లండ్ టూర్లో అనేక విషయాలు తెలుసుకున్నానని అంటున్నాడీ బ్యాటర్. ‘జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్ మీద దృష్టి సారించడం చాలా ముఖ్యం. నా ఆటపై, ఫిట్నెస్ ఫోకస్ పెడుతున్నా. ఈసారి దేశం తరఫున ఆడే ఛాన్స్ వస్తే.. కచ్చితంగా భారీ స్కోర్లు సాధిస్తా’ అని నాయర్ పేర్కొన్నాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కరుణ్ 25.62 సగటుతో 205 రన్స్ చేశాడంతే.
నిరుడు రంజీల్లో పరుగుల వరద పారించిన నాయర్.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వీడ్కోలు నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్లో జట్టును ఆదుకుంటాడని కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.