KSCA : కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికలకు బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న అధ్యక్ష పదవితో పాటు పలు పోస్ట్‌లకు జరగాల్సిన ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణాధికారి డాక్టర్.బి. బసవరాజు (మాజీ ఐఏఎస్) క్రికెట్ సంఘం నిర్వహణ కమిటీ నుంచి స్పష్టత లేదని.. వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలని పట్టుపట్టారు. దాంతో.. మరో పదమూడు రోజుల్లో జరగాల్సిన ఎన్నికలు వచ్చే నెలాఖరుకు వాయిదా పడినట్టు ఒక కర్నాటక క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికలు వాయిదా పడడానికి కర్నాటక క్రికెట్ సంఘం స్పందించకపోవడమే కారణమని తెలుస్తోంది. డాక్టర్ బసవరాజు ఏం చెబుతున్నాడంటే.. ‘నేను నవంబర్ 14న క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాను. పలు అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ, ఎన్నికల విధివిధానాలకు సంబంధించిన ప్రక్రియను తెలపాలని ఆ లేఖలో కోరాను. కానీ, మూడు రోజులకు అంటే సోమవారం వారి నుంచి రిప్లై వచ్చింది. అది కూడా పాక్షిక సమాచారంతో. అందుకే వచ్చే నెల వరకూ కోర్టు విధించిన ఆదేశాలు అమలులో ఉంటాయి. అంతర్గత విబేధాలను చట్టపరమైంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే ఎన్నికలు జరపడం మంచిది. అందుకు డిసెంబర్ 30 వరకు సమయం ఉంది’ అని ఆయన పేర్కొన్నాడు.
Bengaluru, Karnataka: Member of KSCA and Contestant, Vinay Mritunjay says, “The election officer has made a communication to the acting honorary president secretary and the joint secretary. The election officer has returned to managing committee two letters, one on 14th and 15th.… pic.twitter.com/ziQ94hqFxs
— IANS (@ians_india) November 17, 2025
కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రఘురామ్ భట్ నేతృత్వంలోని సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 30న ముగిసిందిది. కొత్త టీమ్ కోసం నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. మసకబారిన కేఎస్‌సీఏకు పూర్వ వైభవం తేస్తానంటున్న మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వెటరన్ ప్లేయర్‌కు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) మద్దతుగా నిలుస్తున్నాడు. దాంతో.. ఎన్నికల్లో విజయంపై దీమాగా ఉన్నాడు వెంకటేశ్ ప్రసాద్. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నస్వామి స్టేడియం చిక్కుల్లో పడిందంటున్న వెంకటేశ్ ప్రసాద్ తాము పగ్గాలు చేపడితే సుపరిపాలన అందిస్తుందని హామీ ఇస్తున్నాడు.
టీమిండియా తొలితరం పేసర్లలో ఒకడైన ఆయన చిన్నస్వామి ఇమేజ్ పెంచుతానని మాట ఇస్తున్నాడు. గతంలో (2013-16) నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్ ఈసారి కేసీఏ చీఫ్‌గా సుపరిపాలన, పారదర్శకత అందించాలని భావిస్తున్నాడు.
Former India cricketer Venkatesh Prasad announced his candidature for the president’s post in the upcoming Karnataka State Cricket Association (KSCA) elections. Prasad received support from stalwarts Anil Kumble and Javagal Srinath, who were present at the announcement event in… pic.twitter.com/ogOEtdjVjC
— Sportstar (@sportstarweb) November 11, 2025
వెంకటేశ్‌కు మద్దతు పలికిన కుంబ్లే మాట్లాడుతూ… ‘కర్నాటక క్రికెట్ సంఘంలో, కర్నాటక క్రికెట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెంటకేశ్ ప్రసాద్‌కు నేను మద్దతు పలుకుతున్నా. ఈ ఎలక్షన్లో ఆయన టీమ్ కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నాడు. మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ కూడా తాను ప్రసాద్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పాడు.