లక్నో : భారత లెగ్‌స్పిన్నర్ కర్ణ్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున నాలుగు (1 టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20) మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 38 ఏండ్ల కర్ణ్.. ఆదివారం రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. జాతీయ జట్టులో అంతగా గుర్తింపు రాకపోయినా ఐపీఎల్లో మాత్రం మూడు జట్ల తరఫున ట్రోఫీలు గెలిచిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు.
2016 (హైదరాబాద్), 2017 (ముంబై), 2018 (చెన్నై) సీజన్లలో భిన్న జట్లకు ఆడినా హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా అతడు గుర్తింపుపొందాడు. 2021లో విజేతగా నిలిచిన చెన్నై జట్టులోనూ కర్ణ్ సభ్యుడిగా ఉన్నాడు.