న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రష్యాతో భారత్ కొనసాగిస్తున్న బహుముఖ సంబంధాల గురించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి శనివారం వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నట్టు ఆయన వివరించారు.
భారత్-రష్యా సంబంధాలపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన జైశంకర్ ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరిని, శాంతియుత పరిష్కారానికి దోహదపడేలా చేపట్టిన ఇటీవలి దౌత్యపరమైన ప్రయత్నాలను సభ్యులకు వివరించారు. ఈ ఏడాది రష్యా సుమారు 70,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవడానికి అంగీకరించిందని వెల్లడించారు.