హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘సర్’ పేరుతో అక్రమంగా ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ 9 వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీ పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణ చేపట్టనున్నట్టు అఖిలపక్ష పార్టీల జేఏసీ వెల్లడించింది.
ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 6న కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 8న ‘చలో లోక్‌భవన్’ నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.