న్యూఢిల్లీ: భారత్లో ప్రతి ఏడాది నమోదయ్యే కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 1.9 లక్షల కేసులకు ఇన్ఫెక్షన్లు కారణమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) అధ్యయనం వెల్లడించింది. 2024లో దేశంలో సుమారు 15.62 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్లు అంచనా.
ఇందులో 12 శాతానికి పైగా ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్నవేనని అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా నమోదయ్యే కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 23 లక్షల కేసులు ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉన్న 12 రకాల ఇన్ఫెక్షన్ కారకాలను పరిశోధకులు గుర్తించారు. భారత్లో ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న క్యాన్సర్లలో హెచ్పీవీ ప్రధాన కారణంగా ఉంది.