Karishma Kotak | క్రికెట్ లీగ్ డబ్ల్యూసీఎల్ 2025 ఫైనల్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా జరిగినా.. యాంకర్, మాజీ హీరోయిన్ కరిష్మా కొఠక్ వార్తలో నిలిచారు. లైవ్‌లోనే ఆమెకు ఓ వ్యాపారవేత్త ప్రపోజ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. డబ్ల్యూసీఎల్ తర్వాత యాంకర్ కరిష్మా కొఠక్ టోర్నీ యజమాని హర్షిత్ తోమర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నది. ముగింపులో ఇప్పుడు టోర్నీ ముగిసింది.. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ప్రశ్నించింది. దానికి హర్షిత్ సమాధానంతో అందరూ షాక్‌కు గురయ్యారు. హర్షిత్ నవ్వుతూ బహుశా ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి.. నేను మీకు ప్రపోజ్ చేస్తానంటూ చెప్పి వెళ్లిపోయాడు. హర్షిత్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న కర్మిషా ఆ తర్వాత తేరుకొని.. ఓహ్ గాడ్ అంటూ ఇంటర్వ్యూను పూర్తి చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైవ్ టెలికాస్ట్‌లో ప్రపోజ్ చేస్తాననడంతో మాజీ హీరోయిన్ కాస్త ఇబ్బందిపడింది. సోషల్ మీడియాలో పలువురు ఇది సరికాదని, ఆమెకు ఇబ్బందికి గురైందని పేర్కొన్నారు. కరిష్మా కొఠక్ కేవలం యాంకర్‌గానే కాదు కెరియర్ ప్రారంభంలో మోడల్‌గా పని చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. కరిష్మా కొఠక్ తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’ మూవీలో నటించింది. లండన్‌లో పుట్టి పెరిగిన కరిష్మాకు ఇదే తొలి సినిమా, అంతకు ముందు యూకేలో ఆ తర్వాత భారత్‌లో మోడలింగ్ చేసింది. తొలి సినిమాలోనే మెగాస్టార్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్ అవతారం ఎత్తింది. అటు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, మరో వైపు అడపడగా దడపా సినిమాలు చేస్తూ వస్తున్నది. ప్రస్తుతం బాలీవుడ్లో లవ్ ఎఫైర్ మూవీలో నటిస్తుంది.
WCL owner proposing Anchor on live after SA became champions 😭pic.twitter.com/o8fnjBGpb8
— Div🦁 (@div_yumm) August 2, 2025