ముంబై : ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత పేస్ బృందం ప్రత్యర్థి ప్రధాన బ్యాటర్లను వణికిస్తుంటే, స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తున్నారు. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్‌కు అటువంటి పరిస్థితి ఎదురవుతుందని భావించడం లేదని మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ‘విలియమ్సన్ ఎటువంటి బౌలింగ్‌నైనా సమర్ధంగా ఎదుర్కోగల దిట్ట.
అతని ఫుట్‌వర్క్‌ను బౌలింగ్‌కు అనుగుణంగా మార్చుకుని పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు కేన్ సన్నద్ధంగా ఉంటాడు. ప్రతి బంతికి పరుగు రాబట్టేందుకు యత్నిస్తాడు. అతన్ని కట్టడి చేయగలిగితే విజయం మనదే’ అని అన్నాడు.