Srilanka Cricket | కమిందు మెండిస్‌కు పిలుపు.. శ్రీలంక పేస్ దళాన్ని నడిపించనున్న పథిరన..!
Srilanka Cricket : టీ20 వరల్డ్‌కప్ కోసం ఆతిథ్య శ్రీలంక స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాడు ధనంజయ డిసిల్వాకు షాకిస్తూ కమిందు మెండిస్‌కు జై కొట్టారు సెలెక్టర్లు
Srilanka Cricket : టీ20 వరల్డ్‌కప్ కోసం ఆతిథ్య శ్రీలంక స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాడు ధనంజయ డిసిల్వాకు షాకిస్తూ కమిందు మెండిస్‌కు జై కొట్టారు సెలెక్టర్లు. దసున్ శనక సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం ప్రకటించారు. వీరిలో ఐపీఎల్ స్టార్లు పథిరన, థీక్షణ ఉన్నారు. అయితే.. పేసర్ ప్రమోద్ మధుషాన్కు చోటు దక్కలేదు.
మాజీ ఛాంపియన్ శ్రీలంక రెండో టైటిల్ లక్ష్యంగా పటిష్టమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగుతోంది. వలర్డ్‌కప్ సన్నాహక టోర్నికి చరిత అసలంకను తప్పించి దసున్ శనకు పగ్గాలు అప్పగించిన సెలెక్టర్లు.. నిలకడగా నిలకడగా రాణిస్తున్న వాళ్లకే ప్రాధాన్యమిచ్చారు. బ్యాటింగ్ యూనిట్లో పథుమ్ నిశాంక, మిశార, మెండిస్ ద్వయం కీలకం కానున్నారు.
Sri Lanka have recalled Kamindu Mendis and dropped Dhananjaya de Silva from their 15-man squad for the T20 World Cup 🔁 pic.twitter.com/UyIVMiwat6
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2026
ఆల్‌రౌండర్ కోటాలో హసరంగ, వెల్లలాగే చోటు దక్కించుకోగా.. ప్రత్యేక స్పిన్నర్‌గా థీక్షణ ఎంపికయ్యాడు. పేస్ దళానికి పథిరన నాయకత్వ వహించనుండగా.. ఇషాన్ మలింగ, చమీర అతడితో బంతిని పంచుకోనున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఎముక స్థానభ్రంశం చెందడంతో ఇషాన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది.
శ్రీలంక టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్ : దసున్ శనక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కమిల్ మిశార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జెనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియనగే, పవన్ రత్ననాయకే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ థీక్షణ, చమీర, పథిరన, ఇషాన్ మలింగ.
2014లో పొట్టి ట్రోఫీని ముద్దాడిన శ్రీలంక ఈసారి స్వదేశంలో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఆరంభ పోరులో ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో లంక తలపడనుంది. ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వేతో శనక బృందం లీగ్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

