న్యూఢిల్లీ : భారత జాతీయ రైఫిల్ సంఘం(ఎన్ఆర్ఏఐ) నూత న అధ్యక్షుడిగా కలికేష్ నారాయణ సింగ్ దేవ్ గురువారం బాధ్యతలు స్వీకరించాడు. సీనియర్ ఉపాధ్యక్షుడైన కలికేష్, సుదీర్ఘ సెలవుపై వెళ్లిన రణీందర్ సింగ్ స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. 12 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న వారిపై కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ వేటు వేయడంతో రణీందర్ స్థానంలో కొత్తగా కలికేష్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.