Kagiso Rabada : దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ కాగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్లు బౌలర్ల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో బౌలర్గా రబాడా నిలిచాడు. కేవలం 65 టెస్టు మ్యాచ్లలోనే రబాడా ఈ ఘనత సాధించడం గమనార్హం.
రబాడా కంటే మరో ఐదుగురు బౌలర్లు దక్షిణాఫ్రికా 300 టెస్టు వికెట్లు సాధించారు. వారిలో డేల్ స్టెయిన్ (439 వికెట్లు), షాన్ పొలాక్ (421 వికెట్లు), ఎన్తిని (390 వికెట్లు), డొనాల్డ్ (330 వికెట్లు), మోర్కెల్ (309 వికెట్లు) ఉన్నారు. అంటే దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా స్టెయిన్ ముందు వరుసలో ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ జాబితాలో శ్రీలంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.