క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా అయ్యింది. విండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్(Justin Greaves) డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నారు. క్రైస్ట్‌చర్చ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 531 రన్స్ టార్గెట్‌తో విండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓ దశలో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక తొలి టెస్టులో ఓటమి తప్పదు అనుకున్న సమయంలో.. షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు 196 రన్స్ జోడించారు. ఆ తర్వాత హోప్ 140 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక విండీస్ ఓడిపోవడం మళ్లీ ఖాయం అనుకున్న సమయంలో.. గ్రీవ్స్‌కు రోచ్ అండగా నిలిచారు. ఆ ఇద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 180 రన్స్ జోడించారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 457 రన్స్ చేసింది.
జస్టిన్ గ్రీవ్స్ అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశాడు. 388 బంతుల్లో గ్రీవ్స్ 202 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు ఉన్నాయి. టెస్టులోని నాలుగవ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన 4వ విండీస్ బ్యాటర్‌గా గ్రీవ్స్ రికార్డు క్రియేట్చేశాడు. ఇక కీమర్ రోచ్ కూడా క్రీజ్‌కు అతుక్కుపోయాడు. 233 బంతుల్లో అతను 58 రన్స్ చేశాడు. దాంట్లో 8 ఫోర్లు ఉన్నాయి.
A mammoth batting effort from the West Indies middle-order helps the visitors draw the first #NZvWI Test in Christchurch 👏#WTC27 📝: https://t.co/1W0563ctBn pic.twitter.com/SpyWYoS8ia
— ICC (@ICC) December 6, 2025