IND vs SL | జురెల్ శతకమోత.. పాండ్యా తర్వాత ఒకేఒక్కడిగా రికార్డు..!
IND vs SL : కొలంబో టెస్టులో ధ్రువ్ జురెల్(106 నాటౌట్) శతకంతో చెలరేగాడు. ఏడో స్థానంలోశ్రీలంకపై వంద కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
IND vs SL : కొలంబో టెస్టులో ధ్రువ్ జురెల్(106 నాటౌట్) శతకంతో చెలరేగాడు. ఏడో స్థానంలోశ్రీలంకపై వంద కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. లంచ్ తర్వాత దూకుడు పెంచిన ఈ కుర్రాడికి టెస్టుల్లో ఇది రెండో శతకం. రిషభ్ పంత్(63) తో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడిన జురెల్ శతక భాగస్వామ్యంతో భారీ స్కోరందించాడు.
రెండో రోజు క్రీజునంటుకున్న ధ్రువ్ జురెల్(106 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. టీ బ్రేక్ ముందే 95 పరుగులతో ఉన్న అతడు.. వర్షం అంతరాయం అనంతరం మూడంకెల స్కోరందుకున్నాడు. అసితా ఫెర్నాండో ఓవర్లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్లో రెండో వంద నమోదు చేశాడీ బ్యాటర్.
💯 𝙛𝙤𝙧 𝘿𝙝𝙧𝙪𝙫 𝙅𝙪𝙧𝙚𝙡! 🫡
A fantastic knock from him to bring up his second hundred in Test cricket! 🙌 🙌
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/D9fYDRpAqG
— BCCI (@BCCI) August 24, 2026
తద్వారా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తర్వాత లంకపై ఏడో స్థానంలో సెంచరీ బాదిన ఆటగాడిగా జురెల్ రికార్డు సృష్టించాడు. 2017లో పల్లెకెలె స్టేడియంలో పాండ్యా 108 పరుగులతో రాణించాడు. ఏడో స్థానంలో లేదా లోయర్ ఆర్డర్లో నితీశ్ కుమార్ రెడ్డిదే చివరి శతకం.2024 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ టెస్టులో రెడ్డి 114 రన్స్ కొట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జురెల్ సెంచరీతో ఆపద్బాందవుడిలా అవతరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

