హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్ కర్రా శివాని రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 100 మీటర్ల బాలికల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో గురువారం శివాని 1 నిమిషం 11 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.
శ్రేయ (1ని. 13సె.), దేవిప్రియ (1ని. 16 సె.) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. బాలికల 200 మీటర్ల మ్యాడ్లే విభాగంలో శివాని విజృంభించింది. 2 నిమిషాల 43 సెకన్లలో గమ్యాన్ని ముద్దాడి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లాస్యశ్రీ కాంస్యం గెలుచుకుంది.