హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ)..జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్(జేపీఎల్) రెండో సీజన్ సందడి మొదలైంది. ఈనెల 7 నుంచి దుండిగల్ ఎమ్ఎల్ఆర్ఐటీ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. గురువారం జేపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరినాథ్ మాట్లాడుతూ ‘జర్నలిస్టులు అందరూ ఇలా ఒకే వేదికపై వచ్చి లీగ్‌లో ఆడుతుండటం అభినందనీయం.
మీడియా సంస్థలన్నింటినీ కలిపి లీగ్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ(ఎస్‌జాట్) కృషి భేష్. క్రికెటర్ల ఆటతీరుపై తమదైన శైలిలో విశ్లేషణలు చేసే జర్నలిస్టులకు ఇప్పుడు ఆటగాళ్లు పడే కష్టాలు జేపీఎల్ ద్వారా మీకు అర్థమవుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగ్ స్పాన్సర్లు సంజయ్ చింతావర్, భరత్‌రెడ్డి, అభిషేక్‌రెడ్డి, గణేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.