Josh Inglis : ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్(Josh Inglis) సులవైన రనౌట్‌ను చేజేతులా మిస్ చేశాడు. మెల్బోర్న్ స్టేడియంలో వెస్టిండీస్(West Indies)తో జరిగిన తొలి వన్డేలో తన తొందరపాటుతో జట్టును ఆశ్చర్యానికి గురి చేశాడు. 47వ ఓవర్లో గుడకేశ్ మోతీ(3) డీప్ కవర్స్‌లో షాట్ ఆడాడు. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపిన ఫీల్డర్ నేరుగా ఇంగ్లిస్ వైపు విసిరాడు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన మోతీ మూడో పరుగు తీసేందుకు సగం క్రీజు దాటాడు.
అయితే.. ఆలోపే ఇంగ్లిస్ బంతి అందుకోవడం చూసి అతడు గబగబా క్రీజువైపు పరుగందుకున్నాడు. కానీ, ఇంగ్లిస్ వికెట్లను గురి తప్పడంతో మోతీ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవాళ్లంతా ‘అందరూ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కాలేరుగా’ అంటూ ఇంగ్లిస్‌ను ఆడుకుంటున్నారు.
Whoops!
Josh Inglis misses from point blank range #AUSvWI pic.twitter.com/m1XsqstNNk
— cricket.com.au (@cricketcomau) February 2, 2024
ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా స్టేడియం (Gabba)లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన వెస్టిండీస్(West Indies) తొలి వన్డే మాత్రం తడబడింది. మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో 231 పరుగులకే ఆలౌటయ్యింది. కేసీ కార్టీ (86 : 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రోస్టన్ ఛేజ్(59 : 67 బంతుల్లో 7 ఫోర్లు)లు హాఫ్ సెంచరీలు ఆదుకున్నారు. అరంగేట్రంలోనే ఆసీస్ యువ పేసర్ గ్జావియర్ బార్ట్లెట్(Xavier Bartlett) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.