Josh Hazlewood : ఆస్ట్రేలియా పురుషుల జట్టు చతుష్టయంలో ఒకడైన పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో మూడొందల వికెట్ల క్లబ్లో చేరాడీ స్పీడ్‌స్టర్. స్వదేశంలో డార్విన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడీ స్టార్ పేసర్. తద్వారా ఆసీస్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో 300లకు పైగా వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా చరిత్రకెక్కాడు హేజిల్‌వుడ్.
గతకొంత కాలంగా టీ20లతో పాటు టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్న జోష్ హేజిల్‌వుడ్ వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. డార్విన్ టెస్టులో బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్లతో మెరిసిన అతడు.. మూడొందల క్లబ్లో చేరాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఆస్ట్రేలియా బౌలర్‌గా అవతరించాడీ పేస్ గన్. ఈ తొమ్మిది మందిలో ఇద్దరే స్పిన్నర్లు ఉండడం విశేషం.
Four of Australia’s nine bowlers with 300+ Test wickets are playing together in the ongoing Darwin Test 😮 pic.twitter.com/vRxbTsdeF3
— Cricinfo (@cricinfo) August 15, 2026
దివంగత షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉండగా.. వెటరన్ బ్రెట్ లీ 310 వికెట్లతో హేజిల్‌వుడ్ కంటే ముందున్నాడు. ఇప్పటివరకూ 76 టెస్టులు ఆడిన హేజిల్‌వుడ్. 14 సార్లు ఐదు వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన..6/67.
1. షేన్ వార్న్ – 708 వికెట్లు
2. నాథన్ లియాన్ – 568 వికెట్లు
3. గ్లెన్ మెక్‌గ్రాత్ – 563 వికెట్లు
4. మిచెల్ స్టార్క్ – 435 వికెట్లు
300 Test wickets for Josh Hazlewood! What an incredible achievement.#MilestoneMoment | @NRMAinsurance | #AUSvBAN pic.twitter.com/XVyS8xdBE2
— cricket.com.au (@cricketcomau) August 15, 2026
5. డెన్నిస్ లిల్లీ – 355 వికెట్లు
6. ప్యాట్ కమిన్స్ – 316 వికెట్లు
7. మిచెల్ జాన్సన్ – 313 వికెట్లు
8. బ్రెట్ లీ – 310 వికెట్లు
9. హేజిల్‌వుడ్ – 301 వికెట్లు