IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బ్యాటర్లు చెలరేగారు. దాంతో, 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదారు. ఆఖర్లో హెట్మెయిర్(39) సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు.ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, రోవ్‌మన్ పావెల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60) తొలి వికెట్‌కు 98 రన్స్ జోడించారు. ప్రమాదకరమైన ఈ జోడీని ముఖేశ్ కుమార్ విడదీశాడు. జైస్వాల్ ఔటయ్యాక పరుగుల వేగం తగ్గింది. సంజూ శాంసన్(0), రియన్ పరాగ్(0) నిరాశ పరిచారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి బట్లర్ ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్ స్కోర్ చేశాడు. రియాన్ పరాగ్(7)ను పావెల్ బౌల్డ్ చేశాక హెట్మెయిర్తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. హెయిట్మెయిర్ ఆఖర్లో చెలరేగి ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది.
Innings Break!@rajasthanroyals score a solid first-innings total of 199/4 in the first innings 👌🏻👌🏻
A challenging chase coming up for #DC. Can they do it❓
Scorecard ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/wNDrEnvSDY
— IndianPremierLeague (@IPL) April 8, 2023