మెల్బోర్న్: స్టార్ రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సినా తన రెజ్లింగ్ కెరీర్లో చాలావరకు బ్యాగీ షార్ట్స్, పెద్ద చైన్లు, క్యాప్లతోనే కనిపించాడు. అయితే, తాజాగా అతను తొడల వరకే ఉండే పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు ఎలా స్పందించాలో తెలియక నెత్తులు గోక్కుంటున్నారు.
అయితే, స్టార్ రెజ్లర్ అయిన జాన్ సినా మహిళలా పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులు, మోకాళ్లదాకా సాక్షులు ఎందుకు ధరించాడని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ‘రికీ స్టానికీ’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ కామెడీ సినిమాలో తను పోషించబోయే పాత్ర కోసం జాన్ సినా మూవీ సెట్లో అలా విచిత్ర వేషధారణలో కనిపించాల్సి వచ్చింది.