హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆల్ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో జోయల్ విజేతగా నిలిచాడు. సోమవారం ముగిసిన టోర్నీలో వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 784 మంది ప్లేయర్లు పోటీపడ్డారు. బాలుర అండర్-15 విభాగంలో రాష్ర్టానికి చెందిన జోయల్ 9 రౌండ్లలో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇదే కేటగిరీలో షార్జిల్ హసన్ షేక్, మనీశ్రెడ్డి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, హైదరాబాద్ చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్, డీవైఎస్వో వెంకటేశ్వర్రావు విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు.