జైపూర్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్లో అతను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్(dancing skills)తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్మేట్ యజువేంద్ర చాహల్(Chahal)తో కలిసి ఓ హిందీ పాటపై స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ డ్యాన్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
Welcome to IPL (Yuzi style) Roooot! 😂💗 pic.twitter.com/bI4rPoRHSE
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2023
జో రూట్‌ను కోటి రపాయలకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. అయితే తీరిక సమయాల్లో ఆ జట్టు ప్లేయర్లు తమ స్టయిల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ‘భరోసా తేరి ప్యార్ తే’ పాటపై జో రూట్ తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. చాహల్‌తో కలిసి అతను డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను ఆర్ఆర్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.
రూట్ డ్యాన్స్ చూసిన క్రికెట్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక నెటిజెన్లు మాత్రం తమ కామెంట్లతో పొగడ్తలు కురిపిస్తున్నారు.