లార్డ్స్: భారత్‌తో జరుగుతున్న మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(Joe Root) సెంచరీ చేశాడు. 99 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రూట్ తొలి బంతికే బౌండరీ కొట్టి సెంచరీ మార్క్ దాటేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. చాలా ఓపికగా రూట్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. 192 బంతుల్లో అతను శతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో అత్యధిక సంఖ్యలో సెంచరీలు చేసిన బ్యాటర్లలో జో రూట్ అయిదో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 51, జాక్ కాలిస్ 45, పాంటింగ్ 41, సంగక్కర 38 సెంచరీలు చేశారు. రాహుల్ ద్రావిడ్, స్టీవ్ స్మిత్‌లు 36 సెంచరీలతో ఆరో స్థానంలో ఉన్నారు.
జో రూట్ సెంచరీలో 10 బౌండరీలు ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో అతను ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడాడు. ఆ పిచ్‌పై అతనికి ఇది 8వ సెంచరీ. ఇండియాపై జో రూట్ ఇప్పటి వరకు టెస్టుల్లో 11 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఇండియాపై టెస్టుల్లో 11 సెంచరీలు చేశాడు.
లార్డ్స్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌ను సమర్పించుకున్నాడు. అయిదో వికెట్‌కు రూట్, స్టోక్స్ మధ్య 88 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. సెంచరీ హీరో రూట్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు బుమ్రా. తాజా సమాచారం ప్రకారం ఇంగ్లండ్ 87.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది.
A splendid knock from Joe Root as he brings up his eighth Test century at Lord’s 👏#WTC27 #ENGvIND 📝: https://t.co/0NCkPJe9tS pic.twitter.com/QiHk4XRXfA
— ICC (@ICC) July 11, 2025