Joe Root : ప్రపంచ క్రికెట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీతో చెలరేగిన రూట్.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాల వీరుడిగా అవతరించాడు. లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్ అందుకొని.. 33వ సెంచరీతో అలెస్టర్ కుక్(Alastair Cook) రికార్డు సమం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజులో పాతుకుపోయిన రూట్ శతక గర్జనతో కుక్‌ను దాటేశాడు. అంతేకాదు ఫ్యాబ్- 4లో తానే మేటి క్రికెటర్ అని ప్రపంచానికి చాటాడు.
సుదీర్ఘ ఫార్మాట్ అంటే చాలు పరుగుల వరద పారించే రూట్ లంక బౌలర్లను ఉతికేస్తూ శతక గర్జన చేశాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో 33వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఓవైపు సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. పట్టుదల వీడకుండా ఆడుతున్న రూట్ డ్రింక్స్ బ్రేక్ సమయానికి రూట్ 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
𝗧𝗵𝗲 moment.
Joe Root goes above Sir Alastair Cook to score the most Test hundreds for England 🐐 pic.twitter.com/cD5aCXl1Id
— England Cricket (@englandcricket) August 31, 2024
Joe Root, England’s top Test centurion 👑 pic.twitter.com/hg2JQk347Y
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
ఫ్యాబ్ – 4 లో ఒకడైన రూట్ తనలో పరుగుల ఆకలి తగ్గలేదని నిరూపించాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే అతడు మూడంకెల స్కోర్ బాదేశాడు. లహిరు కుమార బౌలింగ్‌లో బౌండరీతో రూట్ టెస్టు కెరీర్లో 33వ సెంచరీ నమోదు చేశాడు. దాంతో, 32 సెంచరీలతో ఉన్న స్టీవ్ స్మిత్(Steve Smith), కేన్ విలియమ్సన్(Kane Williamson)లను రూట్ దాటేశాడు. ఇప్పుడు 34వ సెంచరీ కూడా బాదేసి ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాడు.
JOE ROOT, INCREDIBLE!
TWO HUNDREDS IN A TEST FOR THE FIRST TIME IN HIS CAREER! 👏 #ENGvSL pic.twitter.com/vkIDx8KPFM
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
టాస్ గెలిచిన లంక ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా నమ్మకాన్ని నిలబెడుతూ లహిరు కుమార ఆదిలోనే బ్రేకిచ్చాడు. డేంజరస్ డానియెల్ లారెన్స్(9) ను ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ సారథి ఓలీ పోప్(1)ను అసిథ ఫెర్నాండో బోల్తా కొట్టించాడు. తొలి సెషన్లో 42కే రెండు వికెట్లు పడిన దశలో ఓపెనర్ బెన్ డకెట్(40)తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
లంక బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అర్ధ శతకంతో చెలరేగిన రూట్ ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో రూట్ 103 కొట్టడంతో ఇంగ్లండ్ 251 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 482 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 196కే ఆలౌట్ అయిన లంక బ్యాటర్లు ఏమేరకు పోరాడారో చూడాలి.