Carlos Alcaraz : పురుషుల టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్(Carlos Aacaraz) ఏడాది చివర్లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనను సానబెట్టి.. గ్లాండ్స్లామ్ విజేతగా మలిచిన కోచ్ జువాన్ కార్లోస్ ఫెరెరో(Juan Carlos Ferrero)కు గుడ్ బై చెప్పేశాడు. ఏడేళ్ల తమ గురుశిష్య బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడీ స్పెయిన్ కుర్రాడు. ఈ విషయాన్ని బుధవారం ఎక్స్ వేదికగా అల్కరాస్ ప్రకటించాడు. అయితే.. కోచ్ మాత్రం తనను మరికొన్నాళ్లు కొనసాగిస్తే బాగుండనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
టెన్నిస్ ఆటలో రఫెల్ నాదల్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కార్లోస్ అల్కరాజ్ కోచ్‌ను మార్చేశాడు. అయితే.. కొత్తగా ఎవరినీ మనసుకు భారంగా ఉందిన అల్కరాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. ‘ఈ పోస్ట్ రాయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏడేళ్లకు పైగా కలిసి ఉన్నాం. కోచ్, ప్లేయర్‌గా జాన్కీ, నేను విడిపోతున్నాం. నా చిన్నప్పటి కలల్ని నిజం చేసినందుకు నీకు ధన్యవాదాలు. నేను పిల్లాడిగా ఉన్నప్పుడు మన ప్రయాణం మొదలైంది.
Carlos Alcaraz and Juan Carlos Ferrero go their separate ways, with Samuel López continuing as head coach.
Endlessly grateful for the unforgettable points, emotions, and moments that defined the 2025 season 🙌🏻 finishing as world No. 1 🔝
Muchas gracias Juanki and Carlos 🙌🏻❤️ pic.twitter.com/OjIGv1MIBn
— Ferrero Tennis Academy (@Ferreroacademy) December 17, 2025
ఈ అద్భుతమైన జర్నీలో కోర్టులోనే కాదు కోర్టు బయటా ఎల్లవేళలా నువ్వు నాకు అండగా నిలిచావు. నీతో ఈ ప్రయాణాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేశాను’ అని అల్కరాస్ తన పోస్ట్‌లో వెల్లడించాడు. కోచ్ జువాన్ సైతం స్పందిస్తూ తన జీవితంలో ముఖ్యమైన అధ్యాయం ముగిసిందని అన్నాడు.
రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వంటి దిగ్గజాల కెరీర్ ముగుస్తున్న దశలో కార్లోస్ అల్కరాస్ భావి తారగా ఆవిర్భించాడు. తన సంచలన ఆటతో దూసుకొచ్చిన ఈ యంగ్‌స్టర్ చూస్తుండగానే 6 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టి.. నంబర్ 1 ర్యాంక్ సాధించాడు. మనకు తెలిసిన అల్కరాస్‌ను తీర్చిదిద్దింది మాజీ నంబర్ 1 జువాన్ కార్లోస్ ఫెరీరో. అల్కారాస్కు 15 ఏళ్ల వయసు నుంచి అతడు కోచింగ్ ఇస్తున్నాడు. కార్లోస్ శిక్షణలో రాటుదేలిన ఈ కుర్రాడు నొవాక్ జకోవిచ్, జనిక్ సిన్నర్లను నిలువరిస్తూ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. 2022లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ పట్టేశాడు. టెన్నిస్ దిగ్గజంగా ఎదుగుతున్న అల్కారస్ ఇప్పటివరకూ రెండేసి చొప్పున ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు, వింబుల్డన్ ట్రోఫీలు, యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్నాడు.