OU : అవినీతి నిరోధక శాఖ దాడుల్లో బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ (DE Srinivas) రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Executive Engineer) కార్యాలంలో బుధవారం సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ డీఈ శ్రీనివాస్ పట్టుబడ్డాడు. శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ రూ. 11,000 లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ (DSP Sridhar) తెలిపారు.
‘ఓయూ మానేరు హాస్టల్లో సివిల్ వర్క్స్ ట్రాక్టర్ రూ.14 లక్షల బిల్ పాస్ చేయడం కోసం బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ రూ. 11 వేలు లంచం అడిగాడు. వారం రోజుల కింద ఫోన్ పే ద్వారా రూ. 5,000 పంపాడు కాంట్రాక్టర్. మిగిలిన రూ. 6 వేల ఇవ్వాలని శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్‌ను వేధించాడు. దాంతో.. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం అని డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.