హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్టార్ అథ్లెట్ జివాంజీ దీప్తి తెలంగాణకు తొలి పతకాన్ని అందించింది.
బుధవారం జరిగిన మహిళల 400 టీ20 మీటర్ల రేసును దీప్తి 57.85 సెకన్లలో ముగించి పసిడి పతకంతో మెరిసింది. ఇదే విభాగంలో హర్యానాకు చెందిన పూజ (1:08:21సె), భువీ అగర్వాల్ (1:09:24సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.