ముంబై : టెస్టు చరిత్రలో ఈ ముగ్గురూ ఓ స్పెషల్. దాదాపు 147 ఏళ్ల చరిత్ర ఉన్న జెంటిల్మెన్ గేమ్‌లో.. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే, అజాజ్ పటేల్ ఓ అరుదైన రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లుగా ఘనతను సొంతం చేసుకున్నారు. 10 వికెట్లు తీసుకున్న క్లబ్లో చేరిన మూడవ టెస్టు బౌలర్‌గా అజాజ్ పటేల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డును అందుకున్నవారిలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఉన్నారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 53 రన్స్ ఇచ్చి 10 వికెట్లు తీశాడు. ఇక 1999లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఇండియన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 74 రన్స్ ఇచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇవాళ న్యూజిలాండ్ స్పిన్నర్ ఆ అద్భుత ఘట్టాన్ని పునరావృత్తం చేశాడు. అజాజ్ పటేల్ 119 రన్స్ ఇచ్చి ఇండియాపై ఒకే ఇన్నింగ్స్ పది వికెట్లు తీసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు.
Game recognises game! 🤜🤛#INDvNZ pic.twitter.com/62jMgkF3Tx
— BCCI (@BCCI) December 4, 2021
అసాధారణ రీతిలో అరుదైన ఫీట్‌ను అందుకున్న అజాజ్ పటేల్‌కు మాజీ స్పిన్నర్ కుంబ్లే కంగ్రాట్స్ చెప్పాడు. తన ట్విట్టర్లో కుంబ్లే రియాక్ట్ అయ్యాడు. పర్ఫెక్ట్10 క్లబ్‌లోకి స్వాగతం అంటూ ట్వీట్లో తెలిపాడు. అద్భుతంగా బౌల్ చేసినట్లు అజాజ్‌ను కుంబ్లే మెచ్చుకున్నాడు. టెస్టు మ్యాచ్ జరిగిన మొదటి రెండు రోజుల్లోనే ఆ ఘనతను అందుకోవడం అద్భుతమన్నాడు.
Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test.
— BCCI (@BCCI) December 4, 2021
He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq
ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా అజాజ్ బౌలింగ్ తీరును ఇండియన్లు ప్రశంసించారు. స్టాండ్స్‌లో ఉన్న మన ఆటగాళ్లు.. అజాజ్‌కు క్లాప్స్‌తో స్వాగతం పలికారు. పది వికెట్లు తీసిన అజాజ్‌కు అశ్విన్ చప్పట్లతో స్వాగతం పలికాడు.