అహ్మదాబాద్ : గుజరాత్‌కు చెందిన ఓ స్వర్ణకారుడు అద్భుత పటిమను ప్రదర్శిస్తూ బంగారంతో క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ (Cricket World Cup trophy) నమూనాను తయారుచేశాడు. బంగారు ఆభరణాల తయారీలో అతడి నైపుణ్యానికి, అంకితభావానికి 0.9 గ్రాముల బరువున్న ఈ మాస్టర్ పీస్ అద్దం పడుతోంది. అహ్మదాబాద్‌కు చెందిన రౌఫ్ షేక్ గత కొన్నేండ్లుగా ఈ మినియేచర్ గోల్డ్ ట్రోఫీలు తయారుచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
2014లో తాను 1.2 గ్రాముల బరువున్న వరల్డ్ కప్ ట్రోఫీని తయారుచేయగా 2019లో గ్రాము బరువున్న ట్రోఫీని తయారుచేశానని గుర్తుచేశాడు. ఇప్పుడు 2023లో 0.9 గ్రాముల బరువుతో ట్రోఫీని తయారుచేశానని రౌఫ్ చెప్పుకొచ్చాడు. రానున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా అవకాశం లభిస్తే తాను ఈ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అందచేస్తానని తెలిపాడు.
వరల్డ్ కప్ ట్రోఫీకి ఈ చిన్న గోల్డ్ నమూనాలు రూపొందించడం ఎంతో సంక్లిష్టతతో వైరుధ్యంతో కూడినదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారీ తక్కువ బరువుతో అన్ని డిటైల్స్‌ను ప్రతిబింబిస్తూ బంగారంతో వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీలను రౌఫ్ ఎంతో డెడికేషన్‌తో తయారుచేయడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
Read More :
Steve Smith: స్టీవ్ స్మిత్ ఔట్‌పై వివాదం.. వీడియో