లక్నో: ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అతను ఔటైన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రబడా బౌలింగ్‌లో ఓ బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్స్‌కు తగింది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే సఫారీలు థార్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. ఇక టీవీ అంపైర్ ఇచ్చిన డిషెషన్ .. బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు ఫీల్డ్ అంపైర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి లెగ్ స్టంప్ నుంచి దూరం వెళ్తున్నట్లు ఆ బంతి కనిపించినా.. టీవీ రిప్లేలో మాత్రం ఆ బంతి వికెట్లను తాగులుతున్నట్లు చూపించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ ఇచ్చిన నిర్ణయాన్ని మార్చేస్తూ థార్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో స్మిత్, ఫీల్డ్ అంపైర్ ఖంగుతిన్నారు.
— Ishan Martinez (@IshanMarti66419) October 12, 2023